టీడీపీ నేతలు కోటంరెడ్డిని చూసి నేర్చుకోవాలి : అనిల్‌ కుమార్‌ యాదవ్‌

-

టీడీపీ ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా గంటలు మోగించిన నెల్లూరు టీడీపీ నేతల్లో ఏ కోశానా విచారం కనిపించలేదని, నవ్వుకుంటూ గంటలు మోగించారని ఎద్దేవా చేశారు. కానీ, చంద్రబాబు అరెస్ట్ పట్ల నిజమైన బాధతో గంటలు మోగించింది ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమేనని అన్నారు. తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచేందుకు కారకుడైన చంద్రబాబు అరెస్ట్ పట్ల బాధపడుతున్న ఫీలింగ్ కోటంరెడ్డి ముఖంలో స్పష్టంగా కనిపించిందని, టీడీపీ నేతలు కోటంరెడ్డిని చూసి నేర్చుకోవాలని అనిల్ కుమార్ అన్నారు.

Will Anil Kumar Yadav be dropped from Jagan's cabinet?

త్వరలోనే మాజీమంత్రి నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి నారాయణ వేల కోట్లు దోచేసుకున్నారని ఆరోపించారు. రూ.800 కోట్ల పేదల అసైన్డ్‌ భూములు నారాయణ దోచేశారు అని ఆరోపించారు. నారాయణ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని అవన్నీ బయటపడతాయన్నారు. చంద్రబాబుతో మాజీమంత్రి నారాయణ ములాఖత్‌పై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. విచారణకు సహకరించకూడదని ఇద్దరూ మాట్లాడుకున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, నారాయణల చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైందని అన్నారు. మోత మోగిద్దాం కార్యక్రమంలో బాగంగా టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పైనా సెటర్లు వేశారు. నారా లోకేశ్‌ను ఒక పులకేశిగా అభివర్ణించారు. ఢిల్లీలో న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు బిల్డప్ ఇస్తున్నారని వాస్తవానికి ఐఆర్ఆర్ కేసులో దొరక్కుండా దొంగలా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు పట్టుకుని నోటీసులు ఇచ్చారని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news