తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో హోరా హోరీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వివిధ పార్టీలకు చెందిన నేతలు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో.. అభ్యర్థులను టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈసారి తనని గెలిపించకపోతే భార్య బిడ్డతో కలిసి ఉరి వేసుకుంటామని వేడుకున్నారు. చంపుకుంటారో సాదుకుంటారు మీ ఇష్టం అని సంచలన కామెంట్స్ చేశారు.డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి అని.. ఫలితాలలో తనను గెలిపిస్తే జయ యాత్ర.. ఓరిస్తే మరుసటి రోజు శవ యాత్ర అని, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని.. 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.