న్యాయం అడిగితే ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర IIIT సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మ హత్య చేసుకున్న బాసర ఐఐఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే విచక్షణ రహితంగా దాడి చేయిస్తారా..? అని ప్రశ్నించారు. బాసర IIIT పరిస్తితి రోజు రోజుకు దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు.
విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా..? న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. స్వాతి ప్రియ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.