వెనుకున్న అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండే.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

వెనుకున్న అక్కల మాట వింటే జూబ్లీ బస్టాండే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.  2018లో తాను కోడంగల్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయాను. ఆ తరువాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేయమని సబితా ఇంద్రారెడ్డి సూచించింది.

సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు తాను మల్కాజ్ గిరి నుంచి పోటీ చేశాను. కానీ పార్టీ తనను మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఎప్పుడైతే ప్రకటించిందో.. అప్పుడే సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కగా బావించే కాంగ్రెస్ లోకి వచ్చానని.. కానీ ఆ అక్క నన్ను మోసం చేసింది అన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి నన్ను మోసం చేశారు. నన్ను మోసం చేశారు కాబట్టే..సబితాను నమ్మొద్దని కేటీఆర్ కి చెప్పానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version