మేడారం జాతర వెళ్లే వారికి బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే

-

మేడారం వచ్చే భక్తులకు బిగ్‌ అలర్ట్. మేడారం వచ్చే భక్తులకు ములుగు కలెక్టర్ ఇలా త్రిపాటి కీలక సూచనలు చేశారు. జంపన్న వాగుకు ఇరువైపులా ఉన్న షవర్ ల కిందనే భక్తులు స్నానాలు చేయాలని ట్వీట్ చేశారు. ప్రమాద అవకాశం ఉన్న దయ్యాలవాగు, ఊరట్టం లోలెవెల్, చింతల్ క్రాస్ రోడ్, చెక్ డ్యామ్, పడిగాపూర్ ప్రాంతాలలో ఈతకు దిగొద్దని సూచించారు. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు.

Important instructions for devotees going to Medaram

ఇక అటు . మేడారం జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా…. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 9 నుంచి అంటే నేటి నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టిసి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంజిబిఎస్ నుంచి మూడు బస్సులు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి 2 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు రూ. 750, పిల్లలకు రూ.450గా బస్సు ఛార్జీలను నిర్ణయించామన్నారు. టిఎస్ఆర్టిసి ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news