తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే పరిస్థితుల్లోనే తెలంగాణ ఎన్నికల రేసులో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఉన్నారు. మరోవైపు 100 సీట్లల్లో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయనున్నట్టు సమాచారం.
ప్రధానంగా పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాల నుండి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలోకి దిగనున్నారు. షర్మిల ఎంట్రీతో పాలేరు పాలిటిక్స్ హీటెక్కాయనే చెప్పాలి. మరోవైపు పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని టార్గెట్ చేస్తారా లేక పాలేరు టికెట్ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వర్ రావుతో ఫైట్ చేస్తారా అనేది ఇప్పుడు రసవత్తరంగా మారింది. అక్టోబర్ 12న మధ్యాహ్నం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని ఫ్లాన్ చేశారు షర్మిల. ఈ సమావేశంలో పోటీపై పూర్తి క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.