ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ : రాహుల్ గాంధీ

-

కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోటీ జరుగుతుంది. తెలంగాణ ప్రజల కలలు నిర్వీర్యమయ్యాయి. లక్షల కోట్లు దోచుకొని ఒక్క ప్రాజెక్టును కూడా సరిగ్గా కట్టలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల ఊబిలో పడింది. ఇప్పుడు ఉన్న సీఎం తనకు రాజులా భావిస్తున్నారు. నాగార్జున సాగర్, జూరాల, సింగూరు ప్రాజెక్టులు అన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించామని గుర్తు చేశారు. లక్షలాది మంది పేదలకు భూమిని ఇచ్చామని తెలిపారు. దొరల ప్రభుత్వం ఏం చేస్తుంది.

ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములను లాక్కుంటుంది. 20 లక్షల రైతులకు నష్టం కలిగింది. అందుకోసమే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఓడించాలి. 500 రూపాయలకే తెలంగాణలో సిలిండర్ ఇవ్వబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. రైతులు మన ప్రాంతానికి పునాదుల లాంటి వారు. మనందరికీ తెలుసు రైతులు కష్టపడి చేస్తారో.. రైతులు, కార్మికులు ఇంకా కష్టాలు పడుతున్నారు. అందుకోసమే తెలంగాణలో ఉన్న రైతు కార్మికులందరికీ సంవత్సారికి రూ.15,000 ఇవ్వబోతుంది. రైతు కూలీల కోసం 12000 ఇవ్వబోతున్నామని తెలిపారు. రూ.2వేలు ఫింఛన్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రతీ నెల 4వేలు ఇస్తామని తెలిపారు. ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని తెలిపారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version