ఇందిరమ్మ రాజ్యం కాదు.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది : ఎమ్మెల్సీ కవిత

-

ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుల నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్సీ కవిత వెళ్లి హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదని, పోలీసు రాజ్యం నడుస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు.

బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును సీఐ రిజెక్ట్ చేశారని ఆరోపించారు. ఎందుకు కంప్లైంట్ తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి సీఐని ప్రశ్నించడం జరిగిందన్నారు. దీంతో తిరిగి పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణమన్నారు. మార్నింగ్ 10 గంటలకు అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వివిధ సెక్షన్లు పెడుతూ ఇప్పటి వరకు రిమాండ్ కి  తరలించకుండా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనను డిటేన్షన్లో పెట్టాలనే ఉద్దేశంతో సాయంత్రం 5 గంటలకు కోర్టు మూసివేసే వరకు వెయిట్ చేశారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news