అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ విద్యార్థుల హవా కొనసాగుతోంది. తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ స్పెల్ బీ పోటీలో విజయం సాధించాడు. ఫ్లోరిడాకు చెందిన బృహత్ సోమ ఫైనల్‌లో 29 పదాలను 90 సెకన్లలో తప్పు లేకుండా చెప్పి కప్పుతోపాటు 50 వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు.
బృహత్ ప్రస్తుతం ఏడో గ్రేడ్ చదువుతున్నాడు. అతని తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీల్లో 245 మంది విద్యార్థులు పాల్గొనగా 8మంది ఫైనల్‌కు చేరుకున్నారు. ఇందులో బృహత్, ఫైజన్ జాకీ మధ్య టై అవ్వడంతో టై బ్రేకర్‌గా ఇద్దరికీ 90 సెకన్ల సమయం ఇచ్చారు. ఇందులో జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా… బృహత్ 29 పదాల స్పెల్లింగ్‌లను తప్పుల్లేకుండా చెప్పి టైటిల్ గెల్చుకున్నాడు. 2022లో జరిగిన పోటీల్లో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకన్లలో 22పదాల స్పెల్లింగ్‌లు తప్పుల్లేకుండా చెప్పగా ఆ రికార్డును బృహత్ బద్ధలు కొట్టాడు.