తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు?

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలెర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. 2024 ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ మధ్య తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం అందుతుంది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జనవరి మాసంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రాక్టికల్స్ ఉంటాయి.

Inter exams from February 28

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చేయడాది లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరగా పరీక్షలన్నీ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news