తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ నేటి నుంచి ఈనెల 9 వరకు కొనసాగనన్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండు సెక్షన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, సప్లిమెంటరీ రాత పరీక్షలు ఈనెల 12 నుంచి 20 వరకు జరగనున్నాయి.
ఫస్టియర్ కు 2.70 లక్షల మంది, సెకండియర్ కు 1.41 లక్షల మంది హాజరు కానున్నారు. కాగా, HYD శివారులోని కోకాపేటలో నిర్మించనున్న BRS ‘సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హెచ్ఆర్డి’ భవనానికి CM KCR ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. పార్టీ శ్రేణులకు రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతుల నిర్వహణతో పాటు వారికి సమగ్రమైన సమాచారం లభించేలా దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భవనం ఉండనుంది. అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ సహా అత్యాధునిక హంగులతో కూడిన సదుపాయాలు కల్పించనున్నారు.