నారాయణ కాలేజీలో దారుణం…5వ అంతస్తు కిటికీ నుంచి జారీ పడి విద్యార్థి మృతి..!

-

నారాయణ కాలేజీ మరో దారుణం చోటు చేసుకుంది. నారాయణ కాలేజీ మరో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మాదాపూర్ లో నారాయణ కాలేజీ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన నారాయణ కాలేజీ వర్మా -1 క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఐదవ అంతస్తు కిటికీలో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించాడు ఇంటర్ విద్యార్థి.

Inter student of Narayana College died in Madapur

ఈ తరుణం లోనే జారి కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు విద్యార్థి శివకుమార్ రెడ్డి. దీంతో వెంటనే విద్యార్థి శివకుమార్ రెడ్డిని తరలించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోపే విద్యార్థి శివకుమార్ రెడ్డి…మరణించాడు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన శివకుమార్ రెడ్డిగా గుర్తించారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news