గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అమోయ్ కుమార్ అబ్దుల్లాపూర్ మెట్‌లో జరిగిన భూకేటాయింపుల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన్ను విచారించేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ప్రస్తుతం పశుసంవర్ధక సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతన్న అమోయ్ కుమార్ ఈడీ ఎదుట హాజరయ్యారు.
బషీర్ బాగ్‌లోని ఈడీ ఆఫీసులో తన లాయర్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు. అమోయ్ కమార్ గతంలో తమను బెదిరించి భూములను లాక్కున్నారని రెవెన్యూ అధికారులకు, పోలీసులకు స్థానిక రైతులు ఫిర్యాదులు చేశారు.దీంతో ఈ మొత్తం వ్యవహారంలో అమోయ్ కుమార్ పాత్రపై నిజానిజాలు తేల్చేందుకు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.దీంతో మీడియా కంట పడకుండా నేటి ఉదయం 8 గంటలకు ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. విచారణ అనంతరం ఈడీ ఏం చర్యలు తీసుకుంటుందా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.