హంతకుడే రైతులకు సంతాప సభ పెట్టినట్టుంది : ఎమ్మెల్యీ కవిత 

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దళితులను మరోసారి మోసం చేసే ప్రతయ్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దేశాన్ని, రాష్ట్రాన్ని చాలా ఎక్కువ రోజులు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పెట్టి దళితులకు ఏమో చేస్తామనే భావన దారిద్య్రం తప్పా మరోటి కాదన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలంగాణకు వచ్చి ఎస్సీ డిక్లరేషన్ చేయడం అర్రస్ పాట పాడినట్టు ఉందన్నారు. ఎస్టీలకు ఎన్నో ఏండ్లు పేదరికంలో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని మండి పడ్డారు. ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేసే ఎత్తుగడలు తప్ప.. దళితుల కోసం చేసేది ఏమి లేదన్నారు. ఇన్ని రోజులు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించారు. రైతుల కోసం బీజేపీ మీటింగ్ పెట్టడం.. ఆ సభకు అమిత్ షా రావడం.. హంతకుడే రైతులకు సంతాపం తెలిపినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని.. బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. దళితుల కోసం పని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version