కాంగ్రెస్ లో మా కోవర్టులున్నారు.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు 

-

“కాంగ్రెస్ పార్టీ వాళ్లను మనోళ్లు ఏమీ అనొద్దు.. వాళ్లు మనోళ్లే.. మనమే వాళ్లను ఆ పార్టీలోకి పంపాం.. గెలిచిన తరువాత వాళ్లు మన పార్టీలో చేరుతారు” అని బీఆర్ఎస్ నాయకుడు.. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న అధికార బీఆర్ఎస్ పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు అగ్ర నేతలు కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతుండగా.. బాల్క సుమన్ మాత్రం కాంగ్రెస్ నాయకులను ఏమనొద్దని.. వాళ్లు తమ వాళ్లే అని బీఆర్ఎస్ కార్యకర్తలకు సూచించడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడంతో సుమన్ మాటలకు విలువ ఏర్పడింది. చెన్నూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు బాల్క సుమన్. ఈయన మాటలను ఎలా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ నాయకులు మల్లగుల్లాలు పడుతుండగా. బీజేపీకి మాత్రం బలమైన ఆయుధం లభించనట్టే అయింది. గతంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దాదాపు 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు కేసీఆర్ ఇస్తున్నారని.. వారు గెలవగానే బీఆర్ఎస్ లోకి వస్తారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version