పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నిక ఓటుకు రూ. 10,000 ఇస్తున్నారట. ఈ నెల 12న జరిగే పులివెందుల జడ్పిటిసి ఉపఎన్నికను టిడిపి, వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఇరు పార్టీలు నువ్వా నేనా అనే విధంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

జగన్ కు కంచుకోట అయిన స్థానంలో తమ పట్టు నిలుపుకోవడానికి ఓటుకు రూ. 10,000 ఇవ్వడానికి వైసిపి పార్టీ సిద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పిటిసి లను గతంలో వైసిపి పార్టీనే గెలిచింది. దీంతో సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు.