దావోస్ లో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్

-

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.

ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో భేటీ అయిన సీఎం పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్ మ్యాప్పై చర్చించారు. అనంతరం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్తో సమావేశమై రాష్ట్రంలో స్కిల్ డెవెలప్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించటం, అందుకోసం అనుసరించే భవిష్యత్తు మార్గాలపై మాట్లాడారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్నయువతకు స్కిల్ డెవెలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెంట్, విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.

Read more RELATED
Recommended to you

Latest news