ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలకు కవితకు ఆహ్వానం

-

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి, బతుకమ్మ క్యాతిని కండంతరాలు దాటించినా ఎమ్మెల్సీీ కవితకి ఈనెల 25న ఆస్ట్రేలియాలో జరగనున్న బతుకమ్మ వేడుకలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ యాక్ట్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆస్ట్రేలియన్ పార్లమెంట్ హౌస్ లో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలలో పాల్గొనాల్సిందిగా సదరు సంస్థ అధ్యక్షులు డాక్టర్ శాంతిరెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ వేడుకలలో పలువురు ఆస్ట్రేలియా ఎంపీలు కూడా పాల్గొననున్నారు. విజయదశమి నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగానే కాక.. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగని నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు కవిత కోవిడ్ బారిన పడ్డ సంగతి కూడా తెలిసిందే. గత రెండు రోజులుగా ఆమె సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version