సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య..!

-

 

ప్రమాణం చేసి చెబుతున్నా.. నేను ఎవరితోనూ మాట్లాడలేదు..అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన శ్రావ్య, సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన ధర్మతేజ్ ఇద్దరు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే రెండున్నర ఏళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా ధర్మతేజ్…. తన బిడ్డతో కలిసి పుట్టింటిలో ఉంటున్నారు శ్రావ్య.

Married woman commits suicide by taking a selfie video
Married woman commits suicide by taking a selfie video

అయితే శ్రావ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోందని అనుమానించిన ధర్మతేజ్… దుబాయి నుంచి ఫోన్ చేసి భార్యను మానసిక క్షోభకు గురిచేసాడు. దీంతో మనస్తాపం చెంది మాత్రలు మింగి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది శ్రావ్య . ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న శ్రావ్య… కొడుకు సాక్షిగా, దేవుడి సాక్షిగా, మా అమ్మ సాక్షిగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు.. నన్ను నమ్ము తేజ్ అంటూ కన్నీళ్లుపెట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news