రేవంత్ రెడ్డి ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడా..? పాడి కౌశిక్ రెడ్డి

-

తెలంగాణ రెండో  సీఎంగా రేవంత్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఏదో ఒక విధంగా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం విధితమే.

ఈ తరుణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సమస్యలను గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాడా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఈ గవర్నమెంట్ ఉన్నదా..? లేదా అనే అనుమానం కలుగుతుందని.. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ, ఫైనాన్స్ సెక్రటరీలు అమెరికా వెళ్లితే.. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎలా పరిస్కరిస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version