2024 లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం – వి.హనుమంతరావు

-

గుజరాత్ హై కోర్టు రాహుల్ గాంధీ పిటిషన్ పై ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం అన్నారు మాజీ టీపీసీసీ చీఫ్ వి.హనుమంతరావు. రాహుల్ గాంధీ పై తప్పుడు ఫిర్యాదు బిజెపి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అన్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజల్లో వచ్చిన ఆధారణను జీర్ణించికోలేక ఇబ్బందులకు గురించేస్తున్నారని మండిపడ్డారు. 2024 లో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రి కావడం ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం పొయ్యేలా కోర్టు తీర్పునిచ్చిందన్నారు.

రానున్న రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా కు ప్రజలు బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఇక మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. వరంగల్ కి మోదీ రావడం కొంత గర్వంగా, కొంత బాధగా ఉందన్నారు. రోడ్డు విస్తరణ కోసం ప్రధాని రావాలా..? అని ప్రశ్నించారు. మోదీ పార్టీ కార్యక్రమాలకోసం వస్తున్నాడా..? అధికారిక కార్యక్రమాల కోసం వస్తున్నాడా..? అని నిలదీశారు. ప్రజాధనంతో పర్యటనలు చేస్తారా..? అంటూ దుయ్యబట్టారు పొన్నాల. 9 సంవత్సరాల్లో కేంద్రం వరంగల్ కి ఏం చేసిందని సిగ్గులేకుండా వస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version