బాబు బలం అదేనంటున్న సాయిరెడ్డి..జగన్‌కు ఇబ్బందేనా?

-

ఇటీవల మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ట్వీట్ తో ముందుకొచ్చారు. ఈ సారి ప్రతిపక్షం బలం ఇదే అంటూ..చంద్రబాబు పేరు చెప్పకుండా కొన్ని అంశాలని చెప్పుకొచ్చారు.  ఏపీలో వారికి మీడియా ఉందని, ధనబలం ఉందని, ప్రచార యంత్రాంగం ఉందని, పథక రచన చేసేందుకు తగినంత సమయం ఉందని, వ్యవస్ధల్ని ఎలా ఏమార్చాలో వారికి తెలుసని, వారికి లేనిదేమీ లేదంటూ పరోక్షంగా చంద్రబాబు రాజకీయం గురించి ప్రస్తావించారు.

ఇక విపక్షాలకు ఇవన్నీ ఉండొచ్చని, తమకు మాత్రం తాను ఎవరికోసం అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజలు ఉన్నారని, వారి కోసం ఏమైనా చేస్తామని అన్నారు. అంటే ప్రజలంతా తమ వైపే ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయాలని జగన్ పలుమార్లు చెప్పారు. వారి మీడియా ఉందని, దత్తపుత్రుడు ఉన్నారని, తమకు మాత్రం ప్రజలు ఉన్నారని, వారే తనకు అండగా ఉండాలని జగన్ చెప్పుకొచ్చారు.

సరే ఇక్కడ జగన్ చెప్పిన..సాయిరెడ్డి చెప్పిన కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఎవరెన్ని చెప్పిన ప్రజలకు అన్నీ తెలుసు అనే విషయం మర్చిపోకూడదు. జగన్, సాయిరెడ్డి చెప్పినట్లు బాబుకు ఆ బలాలు ఉన్నాయని అనుకుందాం. అదే సమయంలో అదే సొంత మీడియా, సపోర్ట్ మీడియా వైసీపీకి ఉంది..ఆ విషయం ప్రజలకు బాగా తెలుసు. ఇక ధన బలం..అందులో వైసీపీ సత్తా ఏంటో కూడా తెలిసిందే.

ప్రచార యంత్రాంగం…ఇది వైసీపీకి కొదవ లేదు. వ్యవస్థలని ఏ మార్చడం..ఈ పని అధికారంలో ఉన్న పార్టీలకే ఎక్కువ సాధ్యం..ఆ విషయం కూడా తెలిసిందే. వ్యూహ రచన..ఇప్పటికే ఐ-ప్యాక్ టీంతో వైసీపీ వ్యూహాల్లో దూసుకెళుతుంది. కాబట్టి సాయిరెడ్డి ఏం చెప్పారో..అవన్నీ వైసీపీకి కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version