సంక్రాంతి పండగ వేళ…తెలంగాణ మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సంక్రాంతి పండగ వేళ తెలంగాణలో యూబీ బ్రాండ్ (కింగ్‌ఫిషర్, బడ్వైజర్) బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మద్యం దుకాణాలకు, బార్లకు కింగ్‌ఫిషర్ బీర్లను ఇవ్వవద్దని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం డిపో మేనేజర్లను ఆదేశించింది.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యూబీ ఉత్పత్తుల అమ్మకాలు జరు పొద్దని ఆదేశించింది. సోమవారం బ్రాండ్‌ల విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో సంక్రాంతి పండగ వేళ…తెలంగాణ మందుబాబులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అయితే.. ఏపీలో మాత్రం ప్రస్తుతం అన్ని రకాల బ్రాండ్ లు దొరుకుతున్నాయి. దీంతో ఏపీ- తెలంగాణ బార్డర్ లో కింగ్ ఫిషర్ బీర్లు విపరీతంగా తాగుతున్నారు తెలంగాణ మందుబాబులు.