బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే కరీంనగర్ త్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఇక పోలీస్ స్టేషన్ లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌశిక్ రెడ్డిని హాజరుపర్చనున్నారు పోలీసులు.
అందుకే పోలీస్ స్టేషన్ లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేస్తున్నారు కరీంనగర్ త్రి టౌన్ పోలీసులు. ఇది ఇలా ఉండగా.. 10టీవీ ఆఫీస్ లో కౌశిక్ రెడ్డి…. ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా 10టీవీ ఆఫీస్ కింద దాదాపు గంట సేపు వేయిట్ చేశారు 35 మంది పోలీసులు. కౌశిక్ రెడ్డిని కరీంగన్ పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.