రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ – జగదీశ్వర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌

-

రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రీడర్ అంటూ తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. రెండు సార్లూ ఐసీసి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని.. రాసిచ్చింది చదవడమే ఆయన చేస్తున్న పని అంటూ రాహుల్‌ పై ఫైర్‌ అయ్యారు. నిన్న, మొన్న గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారని..భాజపాకు బిఆర్ఎస్ రిశ్తేదార్ కాదన్నారు. రాహులే… మోడీకి గుత్తేదారని ఫైర్‌ అయ్యారు.

నాలుగు వేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత అని నిలదీశారు. ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా అని ప్రశ్నించారు. నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని కొనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలే అని ఆగ్రహించారు. అదే చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రంలో వికలాంగులకు 500, వితతంతువులకు ఇచ్చేది 350 అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version