తెలంగాణ రైతాంగ సమస్యల పై గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి. పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. గత వరదల్లో పత్తి రైతుల నష్టాన్ని అంచనా వేయలేదు. పత్తి రైతుల పట్ల కేంద్రం వివక్షతో వ్యవహరిస్తుంది. తెలంగాణ రైతులకు ఒకలా గుజరాత్ రైతులకు మరోలా మద్దతు ధర ఇస్తున్న కేంద్రం.. వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని పరిహారం ఇవ్వాలి అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేసారు.
ఇక సీసీఐ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రభుత్వ సహకారంలేకనే దళారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. రాష్ట్ర వైఖరితో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలుపై విధి విధానాలు సరిగ్గా లేవు. కొనుగోలు కేంద్రాలను ధాన్యం పోటెత్తుతున్నా ధాన్యం మిల్లర్లకు ఇవ్వడం పై ఇంకా మార్గదర్శకాలు లేవు. సన్న ధాన్యం కస్టమ్ మిల్లింగ్ పై మిల్లర్ల అభ్యంతరాలను చర్చించని ప్రభుత్వం. అన్ని అంశాల పై గవర్నర్ కలగజేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు జగదీష్ రెడ్డి.