పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇటీవల రిలీజ్ అయిన కాంగ్రెస్ జాబితాలో పటాన్ చెరు టికెట్ ను… భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి వచ్చిన నీలం మధుకు ఇచ్చింది అధిష్టానం. వాస్తవానికి కాటా శ్రీనివాస్ అక్కడ కీలక నేతగా ఉన్నారు. అలాగే ఆ నియోజకవర్గం టికెట్ తనకే వస్తుందని కాట శ్రీనివాస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రచారం కూడా చేశాడు.
కానీ చివరికి… నీలం మధుకు పటాన్చెరు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో పటాన్చెరువు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ముదిరింది. నీలం మధుకు టికెట్ ఇస్తే… తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మాజీ హోం మంత్రి దామోదర రాజనర్సింహ నిన్నటి నుంచి గుర్రుగా ఉన్నారు. అయితే తాజాగా ఈ విషయంపై జగ్గారెడ్డి స్పందించారు.
అంతేకాదు ఇదే విషయంపై ఏఐసీసీ నేతలకు జగ్గారెడ్డి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. పటాన్ చెరు అభ్యర్థిని మారిస్తే తన నిర్ణయం తాను తీసుకుంటానని హెచ్చరించారు జగ్గారెడ్డి. దీంతో పటాన్ చెరు టికెట్ గొడవ కాస్త… దామోదర రాజనర్సింహ మరియు జగ్గారెడ్డి గొడవగా మారిపోయింది. కాగా నీలం మధుకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు… రేవంత్ రెడ్డి మరియు జగ్గారెడ్డి డబ్బులు తీసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.