వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే – జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

-

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జగిత్యాల నియోజకవర్గ ములో ఎమ్మెల్యే మాట అధికారులు వినే పరిస్థితి లేదంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఉందని… జగిత్యాలలో దారుణంగా ఉందన్నారు.

అధికారుల పని తీరు, మన నాయకుల ప్రవర్తన చూసి ప్రజలతో మాటలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో నాకే పరీక్ష ఉంటుందని.. ఖచ్చితంగా పోటీ చేయాలని ఉంది, కానీ ఇలాంటివి చూసి అవసరమా అన్పిస్తోందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పరిస్థితి ఇలానే ఉంటే.. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమేనన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version