జనగామలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనరాహు రోహుకు ఎక్కువ అవుతుంది. కండక్టర్ శంకర్ పై సస్పెన్షన్ ఎత్తివేసేంతవరకు నిరసన విరమించేదే లేదని డిపో ఎదుట తిష్ట వేసి కూర్చున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. కండక్టర్ శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి డిపో మేనేజర్ కాళ్ళ మీద పడి వేడుకున్న డిఎం స్వాతి స్పందించలేదు. ఉదయం నుంచి ఇప్పటివరకు డిపో నుండి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళలేదు. దాంతో బస్సులకోసం బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు, విద్యార్థులు.
ఇక ఇదే అదునుగా చూసుకొని ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను దోచుకుంటున్నారు. మాములుగా తీసుకునే దానికంటే అధిక ధరలు వసూల్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై చర్చించడానికి జనగామ డిపోకు చేరుకున్నారు వరంగల్ రీజినల్ మేనేజర్. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరుపుతున్నారు ఆర్ఎం. అయితే ఎలాంటి విచారణ జరుపకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ఆర్ఎం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాల నాయకులు.