కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన వారిన సస్పెండ్ చేయాలని రూల్స్ ఉన్నట్లు తెలిపారు. నేను మొదటి నుంచి పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ వస్తున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఎలాంటి కోపం లేదు…పార్టీ నా సొంత ఇళ్లు లాంటిదని తెలిపారు. నా అనుభవం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని తెలియజేశారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సస్పెండ్ చేయాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. చట్టంలో ఉన్న కొన్ని లొసుగులను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ఉందని.. అలాంటప్పుడు ఇతర పార్టీల వాళ్లని చేర్చుకోవడం దేనికి? అని నిలదీశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.