నేను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పోలీస్ స్టేషన్ లో ఇచ్చానని చెప్పారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మోకిలా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. 114 ఎకరాల సామ దామోదర్ రెడ్డి భూమి వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

తనపై వేసిన కేసు కొట్టివేయాలంటూ జీవన్ రెడ్డి వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది హైకోర్టు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఇక దీనిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు. నేను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పోలీసులు మళ్లీ పిలిస్తే తప్పకుండా విచారణకు హాజరు అవుతాను…. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నాపై కేసులు అన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.