BREAKING: జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారట జీవన్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ ఇవ్వనున్నారట జీవన్ రెడ్డి.
ఇక అంతకు ముందు జీవన్ రెడ్డి మాట్లాడుతూ…ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు…నా భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారని… ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా.
ఇంకా నాకు ఈ పార్టీ ఎందుకు.. ఈ ఎమ్మెల్సీ పదవి ఎందుకు అన్నారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు.. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వెల్లడించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.