‘ఎమర్జెన్సీ’ విధించే మనస్తత్వం కాంగ్రెస్లో సజీవంగా ఉంది : ప్రధాని మోదీ

-

కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు గత ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రతీ ప్రజాస్వామ్య సూత్రాన్ని విస్మరించి యావత్‌ దేశాన్ని జైలుపాలు చేసిందని విమర్శించారు. దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడి ఇవాళ్టికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

“దేశంలో 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని ఎదిరించిన మహానుభావులందరికీ ఇవాళ నివాళులర్పించే రోజు. ప్రాథమిక స్వేచ్ఛను.. ప్రతీ భారతీయుడు ఎంతో గౌరవించే రాజ్యాంగాన్ని ఎలా కాంగ్రెస్ తుంగలో తొక్కిందో ఈరోజు మనకు గుర్తుచేస్తుంది. కాంగ్రెస్‌తో విభేదించే ప్రతి వ్యక్తిని హింసించారు. ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌కు ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను చెప్పుకునే హక్కు లేదు. ఇదే కాంగ్రెస్‌ నేతలు లెక్కలేనన్నిసార్లు ఆర్టికల్ 356 విధించారు. పఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన మనస్తత్వం కాంగ్రెస్‌లో ఇంకా సజీవంగానే ఉంది. అది దాచిపెడతామని కాంగ్రెస్‌ చూసినా.. భారతీయులు అవి గుర్తుంచుకుని వారిని పదేపదే తిరస్కరిస్తున్నారు”. అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news