బీజేపీలో ముసలం.. బండి సంజయ్‌ను ట్రోల్ చేసిన జితేందర్ రెడ్డి !

-

తెలంగాణ బీజేపీ పార్టీలో ముసలం చోటు చేసుకుంది. తాజాగా తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తూ ఏపీ జితేందర్ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరం అంటూ బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఏపీ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. ఈ ట్వీట్‌ పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ కావడంతో…. ఏపీ జితేందర్ రెడ్డి.. తన ట్వీట్‌ ను డిలీట్‌ చేశారు. అటు.. ఏపీ జితేందర్ రెడ్డి చేసిన బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆయన శ్రేణులు సీరియస్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా, గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version