సిమెంట్ పరిశ్రమను అమ్మేస్తే..బీజేపీ నేతలను తరిమి కొడతాం – జోగు రామన్న

-

సిమెంట్ పరిశ్రమను అమ్మేస్తే..బీజేపీ నేతలను తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న. సిమెంట్ పరిశ్రమ అమ్మెస్తే బిజెపి నేతలను జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరికలు జారీ చేశారు. సీసీఐని అమ్మేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమని ఫైర్‌ అయ్యారు. బిజెపి ఎంపి సోయం బాపురావ్ రాజీనామా చేయి..లేదంటే సీసీఐ పై మీవైఖరి ఏంటో చెప్పు అంటూ నిలదీశారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న.

సీసీఐ ని వేలం వేస్తే జిల్లా ప్రజలు బిజెపిని వేలం వేస్తారంటూ హెచ్చరించారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న. బిజెపి నేతలను ఎక్కడికక్కడ ఘెరావ్ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమ కోసం తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇన్నాళ్ల పాటు సీసీఐ ని తెరిపిస్తామన్న బిజెపి నేతలంతా ఎక్కడికెల్లారని నిలదీశారు ఎమ్మెల్యే జోగురామన్న. బీజేపీ పార్టీ నాయకులు.. అన్ని అమ్ముకుంటూ వెళుతున్నారని.. వారికి తగిన బుద్ది చెప్పాలని కోరారు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version