జానీ మాస్టర్ వివాదం.. తెలంగాణ మహిళా కమిషన్ కి ఫిర్యాదు

-

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా కమిషన్  కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన జానీ పై చర్యలు తీసుకోవాలని మహిళ కమిషన్ కి 40 పేజీల ఫిర్యాదు అందించింది బాధితురాలు.

మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా సంఘం సభ్యులతో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జానీ మాస్టర్ లఢక్ లో ఉన్నట్టు సమాచారం. నాలుగు పోలీస్ బృందాలు గాలింపు చేపడుతున్నాయి. జానీ మాస్టర్ పై ఓ బాధితురాలు ముందడుగు వేయగా.. మరోవైపు నటి పూనమ్ కౌర్ ఏకంగా ఓ ప్రముఖ దర్శకుడి పై తాను గతంలో ఫిర్యాదు చేసినా సినీ పెద్దలు ఎవ్వరూ పట్టించుకోలేదంటూ చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. 

Read more RELATED
Recommended to you

Latest news