తెలంగాణకు కేంద్రం ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది: జేపీ నడ్డా

-

కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నిరంగాల్లో అవినీతి రాజ్యమేలిందని వెల్లడించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను కూడా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సరికాదన్న నడ్డా.. ఆయా పార్టీల వారసుల కోసమే ఇండియా కూటమి పెట్టారని విమర్శించారు.

“ఇండియా కూటమి నేతలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు. అనేకమంది కూటమి నేతలు అవినీతి చేసి జైళ్లకు వెళ్లారు. కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ మద్యం కేసు కుంభకోణంలో ఉన్నారు. కుటుంబ వారసత్వం కొనసాగించేందుకే ఇండియా పేరుతో కూటమి కట్టారు. మా హయాంలో మేడిన్ ఇండియా ఔషధాలు ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. ఒకప్పుడు ఫోన్లన్నీ మేడిన్‌ చైనా, కొరియా, జపాన్‌ అని ఉండేవి. మేకిన్ ఇండియా పేరుతో భారత్‌లోనే ఫోన్లు తయారవుతున్నాయి. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం.. మరో ఐదేళ్లు కొనసాగిస్తాం.” అని నడ్డా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news