Jubilee hills rape case: బాధితురాలి తండ్రి ఫిర్యాదు తర్వాత నిందితుల పరార్..

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచనల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారం జరిగిన తర్వాత మూడు రోజుల పాటు బాధితురాలి ఫ్యామిలీపై నిందితులు ఫోకస్ సెట్టారు. పోలీస్ ఫిర్యాదు ఇస్తే పారిపోయేందుకు నిందితులు ప్లాన్ వేసుకున్నారు. మే 31 వరకు నిందితులు బాధితురాలి ఇంటిపై నిఘా పెట్టారు. మే 31న బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ముగ్గురు సిటీ వదిలి పారిపోయారు. బంజారా హిల్స్ లో నివాసం ఉండే ఒక నిందితుడు తమ కుటుంబంతో కలిసి తమిళనాడు కు పరార్ అయ్యాడు మరో నిందితుడు గోవాకు పరారీ.. ఇంకొక నిందితుడు కుటుంబసభ్యులతో కలిసి ఏపీకి పరారయ్యాడు. నిందితులు తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేయడంతో వారి కుటుంబ సభ్యలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. దీంతో వారుండే ప్రాంతాలను కనుగొన స్పెషల్ టీములను ఏపీ, తమిళనాడు, గోవాలకు పంపారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఐదుగురు మైనర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఏ2, ఏ3, ఏ4 లను విచారించేందుకు జువైనల్ కోర్ట్ అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు మైనర్లను పోలస్ కస్టడీకి అప్పగించింది కోర్ట్. ఇప్పటికే ఏ1గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను పోలీసులు విచారిస్తున్నారు.  ఈ రోజు కేసును రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version