సింగరేణి కార్మికులకు ఇచ్చింది బోనస్ కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తాజాగా హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో సింగరేణి ఎన్నో విజయాలను సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో లాభాల్లో వాటా 20 శాతానికి మించలేదన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.

తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.1,060 కోట్ల లాభాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. 2014-15 లో 102 కోట్లకు పైగా కార్మికులకు ఇచ్చామని.. 2018-19లో రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయని తెలిపారు. ఆ ఏడాది ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఇచ్చామని గుర్తు చేశారు. 2023లో ఒక్కో కార్మికుడికి 1.60 లక్షలు అందజేశాం. ఒక్కో కార్మికుడికి 1.80లక్షల నష్టం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై నేరుగా సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం 4,701 కోట్లు లాభాలు వచ్చాయని తెలిపారు. అందులో 33 శాతం వాటా కార్మికులకు ఇచ్చామన్నారు. 33 శాతం వాటా అంటే.. ఒక్కో కార్మికుడికి 3.70లక్షల బోనస్ రావాలన్నారు. కానీ ప్రభుత్వం 1.90లక్షలు మాత్రమే బోనస్ గా ఇచ్చిందని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version