‘ఆ సినిమాలు చూసే రేప్ చేశాం’.. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు..!

-

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వరుసగా బయటికి వస్తున్న వీడియోలు పోలీసులను పరేషాన్ చేస్తున్నాయి. అసలు ఈ వీడియోలు ఎవరు లీక్ చేస్తున్నారన్నది మిస్టరీగా మారింది.

అయితే ఈ విషయంలో కీలక పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరొకరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే.. తాజాగా ఈ కేసులో షాకింగ్‌ నిజాలు బయటపడ్డాయి. రేప్‌ కు ప్రేరేపించిన పరిస్థితులపై విచారణ జరుపగా.. నిందితులు షాకింగ్‌ నిజాలు చెప్పారు. ఇంగ్లీష్‌ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ లలో సన్నివేశాలే తమకు ప్రేరణ అని.. అందరం అనుకుని రేప్‌ చేశామని ఇద్దరు నిజం ఒప్పుకున్నారు. పక్క ప్రణాళిక ప్రకారమే.. రేప్ చేసినట్లు తెలిపారు. కాగా.. ఇవాళ్టి తో వారి విచారణ పూర్తి కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news