రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. నేటి నుంచే తెలంగాణలో జూడాలు మెరుపు సమ్మెకు దిగుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో OP సేవలు, తాత్కాలిక OT సేవలను బహిష్కరించి సమ్మె లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు జూనియర్ డాక్టర్లు.
స్టై ఫండ్ రెగ్యులర్ గా రావాలని…సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీ లకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అని పెట్టి 2.5లక్షలు ఇస్తామన్నారు నెలకు..ఇప్పుడు 92వేలు ఇస్తా అంటున్నారు…NMC గైడ్ లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి సరిగ్గా ఇవ్వడం లేదని ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చాలని తెలంగాణలో జూడాలు మెరుపు సమ్మెకు దిగుతున్నారు.
డాక్టర్ల పై పేషంట్స్ బంధువుల నుంచి జరుగుతున్న దాడులు ఆపాలని… పని ప్రదేశాల్లో భద్రత పెంచాలని కోరుతున్నారు. ఉస్మానియా కొత్త భవన నిర్మాణం చేపట్టాలి… కాకతీయ మెడికల్ కాలేజీ లో సరైన రోడ్డు వసతి లేక ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. PG లకు రెండు నెలలుగా, హౌస్ సర్జన్ కు మూడు నెలలు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు 6 నెలల నుండి స్టయిఫండ్ రావాలని డిమాండ్ చేస్తున్నారు.వెంటనే ప్రభుత్వం స్టైఫండ్ విడుదల చేయాలంటున్నారు జూడాలు. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలాస్పందిస్తుందో చూడాలి.