యూట్యూబర్ శంకర్ కి జ్యుడిషియల్ రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలింపు

-

యూట్యూబర్ శంకర్ కు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతన్ని పోలీసులు చంచల్ గూడ జైలు కు తరలించారు. న్యూస్ లైన్ యూట్యూబ్ చానెల్  నిర్వాహకుడు శంకర్ తనను మోసం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శంకర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై అత్యచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేగాక పెళ్లి చేసుకోమని అడిగినందుకు బెదిరింపులకు గురి చేస్తున్నాడని, తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆ యువతి అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేసింది.

దీంతో రంగంలోకి దిగిన అంబర్ పేట పోలీసులు శంకర్ ను తన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా శంకర్ పై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు శంకర్ పై ఐటీ యాక్ట్ (IT Act) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. యువతి ఫిర్యాదును పరిశీలించిన కోర్టు శంకర్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ను విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో పోలీసులు శంకర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news