ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. జగన్ అన్నను చూసి అధికారులు పరిగెత్తారని అవినాష్ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో వాళ్ల దిట్ట. సీబీఐ విచారణ జరిగింది. జగన్, అవినాష్ ల అంతా తెలుసు.. అవినాష్ రెడ్డికి వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా..? పాడా నిధులు రూ.800 కోట్లు పాడు చేశారు. చిత్రావతి నీళ్లు పులివెందులకే చేరలేదు. వైనాట్ 175 అని 11 స్థానాలకు దిగజారిపోయాడు.
మళ్లీ పోటీ చేస్తాం అంటున్నారు.. ఆ ఉన్న 11 సీట్లు కూడా రావు. 5 రోజుల క్రితం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అవినాష్ స్పందించారు. నన్ను బాగా గమనిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు చనిపోతారని మాకేమైనా ముందే తెలుసా.. వచ్చిన ప్రతిసారి రెండేళ్లో మళ్లీ అధికారంలోకి వస్తానని.. నువ్వు కేసుల్లో ఇరుక్కున్నావు. వివేకా హత్య మీకు తెలిసి జరిగింది కాదా..? అని ప్రశ్నించారు.