BREAKING : కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జూపల్లి కృష్ణారావు !

-

టీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగులనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, జూపల్లి కృష్ణరావు టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పబోతున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి… కాంగ్రెస్ లో చేరనున్నారు జూపల్లి కృష్ణరావు. గత కొన్నిరోజుల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీపై విమర్శలు చేస్తున్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.

మొన్నటి వరకు బీజేపీ పార్టీలో చేరతారని అందరూ భావించినా.. తన పాత పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకే.. జూపల్లి కృష్ణరావు… నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గతంలోనే కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ లోకి వచ్చారు జూపల్లి కృష్ణరావు.

ఇది ఇలా ఉండగా.. జూపల్లి కృష్ణరావుతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. బీజేపీ వరంగల్ అధ్యక్షుడు మాజీ mla కొండేటి శ్రీధర్, మెదక్ మాజీ mla శశిధర్ రెడ్డి, మహబూబ్నగర్ మాజీ mla ఎర్ర శేఖర్, హుస్నాబాద్ మాజీ mla అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version