మొత్తానికి మోదీ విజయ్ సంకల్ప్ సభ తర్వాత తెలంగాణలో బీజేపీ గేర్ మార్చింది..ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటూ రాజకీయం నడిపిన బీజేపీ..ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కారుకు బ్రేకులు వేసి…కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదపనుంది. బీజేపీది ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లు రాజకీయం నడపనుంది. మోదీతో పాటు ఇతర కేంద్ర పెద్దల సలహాలు, సూచనలు తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు…ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు సంస్థాగతంగా బలపడే దిశగా ముందుకెళ్లనుంది. మోదీ చెప్పినట్లుగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాల్సి ఉంది…అప్పుడే టీఆర్ఎస్ పార్టీని నిలువరించడం బీజేపీకి సాధ్యమవుతుంది.
అందుకే ఇప్పుడు ఆ దిశగా బీజేపీ ముందుకెళ్లనుంది…ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో బలమైన నాయకులని బీజేపీలో చేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో బీజేపీకి పూర్తి స్థాయిలో బలమైన నాయకులు లేరు..అందుకే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న బలమైన నేతలని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు మొదలుపెట్టనున్నారు. ఇక ఈ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నడవనుంది.