జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ

-

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ (పీసీ ఘోష్‌)కు ఈ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఆయన నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డితో న్యాయవిచారణ జరిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక.. దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికోసం సిటింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా, ప్రస్తుత న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపగా.. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొంది. 100 రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తిచేయాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version