ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుతుందని జోస్యం చెప్పారు. ఈ విషయంపై తాను చీఫ్ జస్టిస్ ను కలిశానని చెప్పారు కేఏ పాల్. త్వరలో అభ్యర్థులు శుభవార్త వింటారని….గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయించే బాధ్యత తనది కేఏ పాల్ హామీ ఇచ్చారు. గ్రూప్ 2 పరీక్ష సిలబస్ లో కొత్త సబ్జెక్ట్ వచ్చిందని..దీంతో వాయిదా వేయాలని కేసీఆర్, కేటీఆర్ కోరితే వాయిదా వేయలేదని కేఏ పాల్ అన్నారు. తాను తన కోడలు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రాలో పరీక్షలను వాయిదా వేయించామన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బుద్ది ఉండొద్దా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 2 పరీక్ష రోజే ఇతర పరీక్షలు ఉన్నాయని కేసీఆర్ కు తెలియకపోతే కేటీఆర్ అయినా చెప్పాలి కదా అని హితవు పలికారు.సీఎం కేసీఆర్ ను ఉరితీయండన్న రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒరేయ్ రేవంత్ రెడ్డి.. ఓ తండ్రిలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉరి తీయమంటావా….నువ్వెలా పీసీసీ చీఫ్ అయ్యావ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒరేయ్ ఆకునూరి మురళి నువ్వెలా కలెక్టర్ అయ్యావ్….తుపాకులు పట్టుకోమని అంటావా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో 10 స్థానాల్లో పోటీ చేస్తామని కేఏపాల్ ప్రకటించారు. ఆగస్ట్ 21న సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ 10 స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు బంధును రూ. 20 వేలు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పాలన తీసుకొస్తానన్నారు.గద్దర్ చనిపోలేదని..ఆయన్ను చంపేశారని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ఒత్తిళ్లు తెచ్చి చనిపోయేలా చేశారన్నారు. గద్దరన్న చివర కోరిక నెరవేర్చాలన్నారు. ఇంటింటా ప్రజాశాంతి పార్టీ రావాలని గద్దర్ అన్నారని..ఆయన కోరిక తాను నెరవేర్చుతానని చెప్పారు.