అమెరికా వెళ్లి… ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి తిరిగి వచ్చారని చురకలు అంటించారు కేఏ పాల్. కేఏ పాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని…తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాలూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాయని.. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతున్నానని చంద్రబాబు కూడా బాధ పడ్డారని వివరించారు. నా మద్దతు తీసుకోకుంటే.. ఏపీకి ఒక్క కంపెనీ రాదంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలలోగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలనని తెలిపారు. చంద్రబాబు ఏపీ సీఎం కాబట్టి లాస్ ఏంజెల్సులో జరిగే గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ వస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని…. ఎఫ్సీఆర్ఏ ఇస్తే నా ట్రస్ట్ ద్వారా నెల రోజుల్లో రూ. 8 వేల కోట్లు తెస్తానని ప్రకటించారు.