కడియం శ్రీహరిపై తిరుగుబాటు..ఏకమైన కాంగ్రెస్‌ నేతలు!

-

ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు స్టేషన్‌ ఘనపూర్‌ కాంగ్రెస్‌ నేతలు. ఏకమైన కాంగ్రెస్‌ నేతలు.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెండా మోసిన కార్యకర్తలను కాదని.. కడియం వర్గీయులకు ప్రాధాన్యత దక్కుతుందని అంటున్నారు.

Kadiam Srihari vs Singapore Indira

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలకు సమాచారం లేదని ఆగ్రహిస్తున్నారు. కార్యక్రమం ఏదైనా కడియం వర్గీయులదే పై చేయి అవుతోందని కూడా ఆగ్రహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కూడా మా మాట వినడం లేదని ఫైర్ అయ్యారు. స్టేషన్ ఘనపూర్ లో సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీనీ బ్రతికించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను రద్దు చేసి పాత కాంగ్రెస్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కడియం శ్రీహరి టిడిపి, టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version