కేసీఆర్ సభ దృష్టి మరల్చేందుకు.. మేడిగడ్డ టూర్ పెట్టారని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామని… కృష్ణ నది కింద ఉన్న ప్రాజెక్టులు krmb కి అప్పగించటం మంచిది కాదన్నారు. ఈ ప్రాజెక్టులు krmb కి వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. కరెంట్ కు కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయన్నారు. వారం కిందనే మేము నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇది చూసిన కాంగ్రెస్ భయపడి నిన్న సభలో తీర్మానం చేశారని చురకలు అంటించారు. మా సభ నుంచి దృష్టి మరల్చేందుకు ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డ కు వెళ్తోంది..కృష్ణ నది పై ఉన్న హక్కులు కాపాడేందుకు బీ ఆర్ ఎస్ సిద్దంగా ఉందన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నల్గొండ సభకు వెళ్తున్నామని..పెద్ద యెత్తున బీ ఆర్ ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, రైతులు వస్తున్నారని వివరించారు. ఇవాళ్టి నుంచి జల యుద్ధం ప్రారంభమైందన్నారు బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.